విజయనగరం జిల్లా సాలూరు మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు పర్వం ప్రారంభమైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి పాండురంగ సమక్షంలో వైకాపా తరుపున పెద్ద పదం గ్రామం నుంచి రెడ్డి సూర్యారావు నామినేషన్ దాఖలు చేశారు. అదే విధంగా తెదేపా తరుపున తోణం గ్రామం నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా గిరిజన మహిళ మువ్వల లక్ష్మి నామినేషన్ వేశారు.