Telangana Minister Ponguleti Srinivas Reddy about Rythu Bharosa : త్వరలో రైతు భరోసా మొదటి విడత నిధులు జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొదటి బడ్జెట్లో రైతుల కోసం రూ.72 వేల కోట్ల నిధులు వెచ్చించామని అన్నారు. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు ఇస్తూ పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. నిర్మల్ జిల్లాలోని భైంసాలో మహారాష్ట్ర ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, పది సంవత్సారాలల్లో గత ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు.
త్వరలో స్మార్ట్‌కార్డులు : వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనలో ఎంతటివారున్నా వదిలే ప్రసక్తే లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఐదు సంవత్సారాలల్లో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే తర్వాత బహుళ ప్రయోజనాలు అందించే స్మార్ట్‌కార్డులు అందిస్తామని అన్నారు. ఈ మేరకు ప్రతి ఒక్కరు కులగణన సర్వే (Telangana Caste Census Survey)కు సహకరించాలని కోరారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఒక్కసారి మాట ఇస్తే మడమతిప్పదన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాగానే తెలంగాణను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు.
రైతులకు ఎగనామం పెట్టిన జగన్ - అయిదేళ్ల పాలనలో అడుగడుగునా మొండిచేయి - YS Jagan Cheated Farmers
'గత ప్రభుత్వం పది సంవత్సరాలల్లో కొత్తరేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వలేదు. 2020లో తెచ్చిన రెవెన్యూ చట్టం, ధరణి పేరుతో రైతులను భయభ్రాంతులకు గురి చేసింది. ఈ ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలను స్వీకరించి అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తోంది'- పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి
అన్ని విధాలుగా అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుందని, దాని వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను అన్నింటిని సరిదిద్దుకొంటూ ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. అంతకముందు భైంసాలోని విశ్రాంతి భవనంలో మంత్రి స్థానిక సమస్యలపై అధికారులతో సమీక్షించారు.
రూ.40 వేల కోట్ల అప్పుకోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు-అందుకోసమేనా? - Farmer Loan Waiver