విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంఘం లిమిటెడ్ (RECS) పై ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఈసీఎస్‌లో అవినీతి రాజ్యమేలుతోందని మండిపడ్డారు. ఎండీగా రమేశ్ ఉన్నంతవరకు ఆర్ఈసీఎస్‌కు మనుగడ లేదని అన్నారు. ఆర్ఈసీఎస్ అవినీతిపై గతంలోనే తాము ధర్నాలు చేశామి..,అయినా అధికారులు ఇప్పుడు ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థంకావట్లేదన్నారు. జిల్లా సమీక్ష సమావేశంలో దీని సంగతి తేలుస్తానని బెల్లాన చెప్పారు.
ఇవీ చూడండి