విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని పున్నపురెడ్డిపేట గ్రామానికి చెందిన సత్యం, సీతమ్మలకు సంతానం లేకపోవడంతో.. తన తమ్ముడి కుమారుడైన ప్రసాద్‌ను పెంచుకున్నారు. సీతమ్మకు గ్రామంలోని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని గమనించిన ప్రసాద్.. పలుమార్లు సీతమ్మను హెచ్చరించాడు. ఈ ఘటనతో ప్రసాద్‌పై కక్ష పెంచుకున్న సీతమ్మ.. తన భర్త సత్యం, మరో వ్యక్తి రామారావు, ఆమె కుమారుడు రమణలకు మాయమాటలు చెప్పి ప్రసాద్‌ను హత్య చేసేందుకు ఒప్పించింది.
ముక్కుకు, నోటికి టేప్ వేసి...
మార్చి 16న పశువులశాలలో నిద్రిస్తున్న ప్రసాద్ కాళ్లు, చేతులు కట్టి.. ముక్కుకు, నోటికి టేప్ వేసి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. ప్రసాద్ చనిపోయాడని నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని నెల్లిమర్ల మండలంలోని జగ్గునాయుడు చెరువులో పడేశారు. కొన్ని రోజుల అనంతరం చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రసాద్‌ను హత్య చేసినట్లు నిర్ధారించారు. హత్యకు పాల్పడ్డ ఐదుగురిని అరెస్టు చేసినట్లు విజయనగరం ఎస్పీ బీ.రాజకుమారి వెల్లడించారు.
పెంపుడు కుమారుడి హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
ఇవీచదవండి.