రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్‌ను విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి పంపిణీ చేశారు. అనంతరం మొబైల్ రైతు బజార్‌ను ప్రారంభించిన ఆయన లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబానికి వెయ్యి రూపాయల ఆర్థిక సాయాన్ని స్థానిక నాయకులు గురుమూర్తి, రవిచంద్రలతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. రేషన్ కార్డు లేని నిరుపేదల కుటుంబాలకు 10 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ ఎస్.ఎస్ వర్మ, సహాయ కమిషనర్ ప్రసాదరావు, స్థానిక వైకాపా నాయకులు గురుమూర్తి, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...