విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థంలో భాజపా నేతల చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈరోజు ఉదయం నాలుగు గంటలకు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఇందుకు నిరసనగా ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్.. గుర్ల పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.
శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంపై మాధవ్ మండిపడ్డారు. రాముని విగ్రహం ధ్వంసం చేసిన దుండగులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా తమ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తప్పుపట్టారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. పోలీసులు వైకాపా ప్రభుత్వ తొత్తులుగా మారారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు.
ఇదీ చదవండి:
రామతీర్థం ఘటన.. దేశం మొత్తానికి జరిగిన అవమానం: సునీల్ దేవధర్