సాలూరు తహసీల్దార్ కార్యాలయంలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలో ఉన్న 33 మంది దివ్యాంగులకు రూ. 2 లక్షల విలువ గల పరికరాలను అందజేశారు.
దివ్యాంగులపై జాలి చూపించాల్సిన అవసరం లేదని... వారికి కావాల్సిన ప్రేమను అందించాలని ఎమ్మెల్యే అన్నారు. కులమతాలకు అతీతంగా దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించడం జరిగిందని... వారిని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: