ETV Bharat / state

పింఛను ఆగిందా... అది మీ తలరాత..! ఎమ్మెల్యే విచిత్ర వాఖ్యలు - ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు

Mla on pension: ‘పింఛను ఆగిందా.. అయితే అది మీ తలరాత’ అని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. దివ్యాంగురాలైన తమ కుమార్తె పింఛన్‌ను రద్దు చేశారని వాపోయిన ఓ తల్లితో.. విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు విచిత్రంగా మాట్లాడారు.

Mla chinnapalanaidu comments on not getting pension
పింఛను రాలేదని చెబితే ఎమ్మెల్యే విచిత్ర వ్యాఖ్యలు
author img

By

Published : May 26, 2022, 9:25 AM IST

Mla on pension: దివ్యాంగురాలైన తమ కుమార్తె పింఛన్‌ను రద్దు చేశారని వాపోయిన ఓ తల్లితో.. విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు విచిత్రంగా మాట్లాడారు. ‘పింఛను ఆగిందా.. అయితే అది మీ తలరాత’ అని వ్యాఖ్యానించారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా బుధవారం ఆయన బొబ్బిలి మండలం వాడాడలో పర్యటించగా ఈ సంఘటన జరిగింది.

‘మా పాపకు రెండేళ్ల క్రితం వరకు రూ.3 వేల పింఛను వచ్చేది. తెదేపా సానుభూతిపరులమన్న కారణంగా కొన్ని నెలలుగా ఇవ్వడం లేదు. కారణమడిగితే 5 విద్యుత్తు మీటర్లు ఉన్నాయని చెబుతున్నారు. మేం అద్దె ఇంట్లో ఉంటున్నాం. పూర్తి వివరాలు, సంబంధిత ధ్రువపత్రాలను విద్యుత్‌శాఖ, సచివాలయంలో అందించాం. అయినా ఎవరూ స్పందించడం లేదు’ అని బాధితురాలి తల్లిదండ్రులు అరుణకుమార్‌, పంచముఖేశ్వరరావు.. ఎమ్మెల్యే వద్ద వాపోయారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.