పార్వతీపురంలో నిర్మించనున్న జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్ర భవనానికి ఎమ్మెల్యే అలజంగి జోగారావు శంకుస్థాపన చేశారు. ఈ కేంద్రంలో గ్రహణ మొర్రి, బుద్ధిమాంద్యం, ఇతర వైకల్యాలు, నేత్ర, దంత సమస్యలకు సత్వరమే వైద్యం అందించనున్నట్లు వెల్లడించారు.
ఆరేళ్లలోపు పిల్లల్లో అనారోగ్య సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. డీసీహెచ్ఎస్జీ నాగేశ్వరరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ వాగ్దేవి, ఇంజినీరింగ్ విభాగం అధికారి సత్య ప్రభాకర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: