విజయనగరం జిల్లా నెల్లిమర్లలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. నాబార్డ్ ఆర్ఐడీఎప్ నిధులతో నిర్మించనున్న 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం అదనపు భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. 2.08 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు భవనాలను ప్రారంభించారు. నెల్లిమర్ల నుంచి రామతీర్థం వెళ్లే మార్గంలో రఘు విద్యాసంస్థలు నిర్మించిన శ్రీ రామస్వామి ఆలయ స్వాగత ద్వారాన్ని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌తో కలిసి ప్రారంభించిన ఆయన.. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
ఎన్నికల హామీలో భాగంగా నెల్లిమర్ల సామాజిక ఆరోగ్య కేంద్రం విస్తరణ పనులను ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆయా ప్రాంతాల ప్రజల విజ్ఞప్తుల మేరకు... జిల్లాలోని మిగిలిన సామాజిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలను కూడా పెంచి., తగిన వసతులను కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎన్నో ఏళ్లుగా కొలిక్కిరాని విజయనగరంలో మెడికల్ కళాశాల స్థల సేకరణను కూడా పూర్తి చేశామన్నారు. నగరం సమీపంలోని గాజులరేగలో ప్రభుత్వం మెడికల్ కళాశాలకు స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని.. త్వరలో సీఎం జగన్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి