ETV Bharat / state

అలాగైతేనే అమ్మఒడి అందుతుంది : మంత్రి బొత్స - విజయనగరం జిల్లా తాజా వార్తలు

MINISTER BOTSA: విజయనగరంలో "అమృత్" పథకంలో భాగంగా.. 196 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 1500 కేఎల్ లీటర్ల సామర్థ్యం గల వాటర్ స్టోరేజ్ ట్యాంక్​ను విద్యాశాఖ మంత్రి బొత్స ప్రారంభించారు. గత మూడేళ్లలో 7,600 కేఎల్ లీటర్ల సామర్థ్యం గల స్టోరేజ్ ట్యాంకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే లక్ష్యంతో ఉన్నామని స్పష్టం చేశారు.

MINISTER BOTSA
ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్ మంజూరు చేయాలనే లక్ష్యంతోనే ముందుకు
author img

By

Published : Jun 23, 2022, 2:01 PM IST

Updated : Jun 23, 2022, 2:09 PM IST

MINISTER BOTSA: విజయనగరంలో ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్ మంజూరు చేయాలనే లక్ష్యంతో నగర పాలక సంస్థ, ప్రజా ప్రతినిధులు పనిచేస్తున్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నగరంలో అమృత్ పథకంలో భాగంగా 196 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 1500 కేఎల్ లీటర్ల సామర్థ్యం గల వాటర్ స్టోరేజ్ ట్యాంక్​ను మంత్రి ప్రారంభించారు. గత మూడేళ్లలో 7600 కేఎల్ లీటర్ల సామర్థ్యం గల స్టోరేజ్ ట్యాంకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు నగరంలో గత మూడేళ్లలో 4800 కేఎల్ లీటర్ల సామర్థ్యం గల ఐదు స్టోరేజ్ ట్యాంక్​లను ప్రారంభించామన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే లక్ష్యంతో ఉన్నామని స్పష్టం చేశారు.

అలాగైతేనే అమ్మఒడి అందుతుంది

అమ్మ ఒడి లబ్ధిదారులు సంఖ్య తగ్గిందనడం అవాస్తమని.. పాఠశాల హాజరు ఆధారంగానే లబ్దిదారుల ఎంపిక జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పిల్లలను సక్రమంగా బడికి పంపితేనే పథకం వర్తిస్తుందని.. 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ముందుగానే చెప్పామని స్పష్టం చేశారు.

ఇంటర్​లో ఫలితాలు ఏమాత్రం తగ్గలేదని.. 2019 కంటే మెరుగైన ఫలితాలే వచ్చాయన్నారు. పాఠశాల, కళాశాల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ రఘు వర్మ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్​లు కోలగట్ల శ్రావణి, రేవతి, కమిషనర్ శ్రీరాములు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

"కే.ఎల్.పురం, ధర్మపురిలో పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు 1500 కిలో లీటర్ల సామర్థ్యంతో మరో మూడు ట్యాంకుల పనులకు రాజీవ్ నగర్, ధర్మపురి, బీసీ కాలనీలో శంకుస్థాపన చేయాల్సివుంది. నగరంలో ఇంటి కొళాయి కనెక్షన్​లకు ఎవరు దరఖాస్తు చేసినా మంజూరు చేసేందుకు కార్పొరేషన్ సిద్ధంగా వుంది. కావలసిన వారు వెంటనే డిపాజిట్ చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు ప్రారంభించిన స్టోరేజ్​ ట్యాంకుల ద్వారా ఏడు వార్డుల్లో తాగునీటి సరఫరా మెరుగుపడుతుంది." - బొత్స సత్యనాారాయణ, విద్యాశాఖ మంత్రి

ఇవీ చదవండి:

Last Updated : Jun 23, 2022, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.