ETV Bharat / state

విజయనగరంలో అమ్మ ఒడి ప్రారంభించిన మంత్రి బొత్స, ఎమ్మెల్యే

author img

By

Published : Jan 11, 2021, 4:23 PM IST

జగనన్న అమ్మ ఒడి పథకం రెండో విడతను విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రారంభించారు. పాఠశాలలో భోజనం ఎలా ఉందోనని మరోసారి ఎమ్మెల్యే పరిశీలించారు.

started Amma Odi in Vizainagaram
జిల్లాలో అమ్మ ఒడి ప్రారంభించిన మంత్రి బొత్స, ఎమ్మెల్యే

నిరుపేద కుటుంబాల పిల్ల‌లు సైతం బాగా చ‌దువుకొని వృద్దిలోకి రావాల‌ని ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి అమ్మ ఒడి ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టార‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. త‌మ ప్ర‌భుత్వానికి విద్య‌, వైద్యం రెండు క‌ళ్లు లాంటివ‌ని స్ప‌ష్టం చేశారు. అమ్మ ఒడి రెండో విడ‌త పంపిణీ కార్య‌క్ర‌మాన్ని విజయనగరం కంటోన్మెంటు మున్సిప‌ల్ ఉన్న‌త పాఠ‌శాల‌లో.. సంయుక్త కలెక్టర్లు మహేశ్వరరావు, వెంకటరావు, డీఈవో నాగమణితో కలసి ప్రారంభించారు. మంత్రి చేతుల‌మీదుగా ల‌బ్దిదారులకు చెక్కును అంద‌జేశారు. ప‌థ‌కాన్ని ఆపేందుకు ప్ర‌తిప‌క్షాలు ఎన్నో కుట్ర‌లు, కుయుక్తులు ప‌న్నిన‌ప్ప‌టికీ, వాటిని అడ్డుకొని, అనుకున్న తేదీకి న‌గ‌దును జ‌మ చేస్తుండ‌టం, ఈ ప‌థ‌కం అమ‌లు ప‌ట్ల‌ ప్ర‌భుత్వానికి ఉన్న‌ చిత్త‌శుధ్దికి నిద‌ర్శ‌న‌మ‌ని మంత్రి పేర్కొన్నారు.

అమ్మఒడి ప్రారంభించిన ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర..

సాలూరులో వైకాపా ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర.. జగనన్న అమ్మ ఒడి పథకం రెండో విడతను ప్రారంభించారు. ఆయన చేతుల మీదగా అమ్మబడి చెక్కులను పిల్లల తల్లులకు అందజేశారు. రాష్ట్రంలో అక్కచెల్లెళ్ళు, కూతుళ్ళు, కొడుకులు అందరికీ జగనన్న మామయ్య రూపంలో 14 వేల రూపాయలు నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బు జమ చేయబడుతుందన్నారు. మిగతా వెయ్యి రూపాయలు.. స్కూలు అభివృద్ధి కోసం విద్యా కమిటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఖాతాల్లోకి జమ చేసి పాఠశాలలు మరింత అభివృద్ధి చేయడానికి ఈ డబ్బును ఉపయోగిస్తారని తెలిపారు. పాఠశాలలో భోజనం ఎలా ఉందోనని మరోసారి ఎమ్మెల్యే పరిశీలించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 16 వేల ఆరు వందల అరవై మంది పిల్లల తల్లులు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయబడినట్లు ఆయన వెల్లడించారు.

ఇవీ చూడండి...: ఆదివాసుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.