నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో.. మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని విజయనగరంలో వలంటీర్లకు శిక్షణ సందర్భంగా స్పష్టం చేశారు. అంతే కాదు.. ఇటీవల రాజధాని విషయంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు తేల్చి చెప్పారు. రాజధానిపై పవన్ వ్యాఖ్యలు ద్వంద్వ వైఖరిలా ఉన్నాయన్న బొత్స.. అమరావతికి ప్రాంతానికి వరద ముంపు ఉందని మరోసారి వ్యాఖ్యానించారు. రాజధాని ఎంపిక, నిర్మాణంపై శివరామకృష్ణ సలహాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిలో రాజధాని నిర్మాణం ఆర్థిక భారమే అని కుండబద్ధలు కొట్టారు. మరోవైపు.. పోలవరం రివర్స్ టెండరింగ్‌పై చట్ట ప్రకారమే తాము ముందుకు వెళ్తామన్నారు.
అమరావతి నిర్మాణం ఆర్థిక భారమే.. కట్టుబడి ఉన్నా: బొత్స
అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యల నుంచి వెనక్కు తగ్గేది లేదన్నారు.. మంత్రి బొత్స. రాజధానికి ముంపు ముప్పు పొంచి ఉందన్నారు. నిర్మాణం ఆర్థిక భారమే అని మరోసారి వ్యాఖ్యానించారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో.. మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని విజయనగరంలో వలంటీర్లకు శిక్షణ సందర్భంగా స్పష్టం చేశారు. అంతే కాదు.. ఇటీవల రాజధాని విషయంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు తేల్చి చెప్పారు. రాజధానిపై పవన్ వ్యాఖ్యలు ద్వంద్వ వైఖరిలా ఉన్నాయన్న బొత్స.. అమరావతికి ప్రాంతానికి వరద ముంపు ఉందని మరోసారి వ్యాఖ్యానించారు. రాజధాని ఎంపిక, నిర్మాణంపై శివరామకృష్ణ సలహాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిలో రాజధాని నిర్మాణం ఆర్థిక భారమే అని కుండబద్ధలు కొట్టారు. మరోవైపు.. పోలవరం రివర్స్ టెండరింగ్‌పై చట్ట ప్రకారమే తాము ముందుకు వెళ్తామన్నారు.
Body:arun
Conclusion:8008574467