ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండగ జరుపుకుంటుంటుంటే...చంద్రబాబు మాత్రం ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబును ప్రజలు ఎందుకు ఓడించారో..ఇప్పటికీ తెలుసుకోలేపోతున్నారని ఎద్దేవా చేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. ఇప్పుడు రైతుల కోసం మాట్లాడుతుండటం సిగ్గుచేటన్నారు. అమరావతిని ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించారు.కొవిడ్ నేపథ్యంలో తాము ఎన్నికల వద్దంటున్నా...తెదేపా కావాలనే రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.
2004 కు ముందు మాన్సస్ ట్రస్ట్‌ను రద్దు చేసి ప్రభుత్వంలో కలపాలని అప్పట్లో అశోక్ గజపతిరాజు ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తించాలన్నారు. అశోక్ హయాంలో మాన్సస్ భూములు అన్యాక్రాంతమైన విషయం ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యనించారు.
ఇదీచదవండి: 15న నరసరావుపేటలో కామధేను పూజ... పాల్గొననున్న సీఎం జగన్