కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణపై విజయనగరం జిల్లా అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షించారు. కొవిడ్-19ని నియంత్రించేందుకు అధికారులు చేపట్టిన చర్యలపై చర్చించారు. జిల్లాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా చేపట్టిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.
కొవిడ్ 19ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని మంత్రి బొత్స తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగుకుండా ఉండేందుకు మార్కెట్లను వికేంద్రీకరణ చేశామని చెప్పారు. నిత్యావసర సరకుల ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విపత్కర సమయంలోనూ కొందరు రాజకీయాలు చేస్తున్నారని... అలాంటి విధానం సరికాదన్నారు.
ఇదీ చదవండి :