రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. తెదేపా నేతలు పరుష పదజాలంతో మాట్లాడుతున్నా.. సీఎం జగన్ ఆదేశాల మేరకు తాము ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని చెప్పారు. చంద్రబాబు సిద్ధాంతాలు నచ్చక ఎందరో ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారని పేర్కొన్నారు. మాచర్ల ఘటన జరగడానికి తెదేపా నాయకుల చర్యలే కారణమని ఆరోపించారు. అయినా ఆ ఘటనలో ముగ్గురిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టడటం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
ఇదీ చదవండి: