ETV Bharat / state

'పరిశుభ్రతలో జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలి'

ప‌రిశుభ్ర‌త అనే ప‌విత్రమైన బాధ్య‌త‌ను ప్ర‌తిఒక్క‌రూ శాశ్వ‌తంగా పాటించడం ద్వారా జిల్లాను ఆద‌ర్శంగా తీర్చిదిద్దవచ్చని విజయనగరం క‌లెక్ట‌ర్ హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. ప‌రిశుభ్ర‌తతో ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించుకోవ‌డమే కాక.. కుటుంబంలోని వృద్ధులు, పిల్ల‌ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు.

ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్
ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్
author img

By

Published : Dec 21, 2020, 4:37 PM IST

విజయనగరం జిల్లా పంచాయ‌తీరాజ్ శాఖ ఆధ్వ‌ర్యంలో "మ‌నం-మ‌న ప‌రిశుభ్ర‌త" కార్య‌క్ర‌మం నిర్వహించారు. వ్య‌ర్ధాల‌పై యుద్ధం పేరుతో పక్షం రోజుల పాటు నిర్వహించిన ఈ ప్ర‌చారోద్య‌మం ముగింపు వేడుక‌లు జ‌మ్ము నారాయ‌ణ‌పురంలో నిర్వ‌హించారు. క‌లెక్ట‌ర్ హరి జవహరిలాల్ హాజరయ్యారు.

ప‌డాల‌పేట కూడలి నుంచి నారాయ‌ణ‌పురం గ్రామ స‌చివాల‌యం వ‌ర‌కు ర్యాలీ చేశారు. గ్రామాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచ‌డం, బ‌హిరంగ మ‌ల‌విస‌ర్జ‌నను విడ‌నాడ‌టం, ప్ర‌తి ఇంట్లో మ‌రుగుదొడ్ల‌ను నిర్మించుకోవ‌డం త‌దిత‌ర అంశాల‌పై నినాదాలు, ప్లే కార్డుల‌తో ర్యాలీ సాగింది. త‌మ గ్రామాన్ని, జిల్లాను ప‌రిశుభ్రంగా ఉంచ‌డంలో చిత్త‌శుద్ధితో ప్ర‌య‌త్నిస్తాన‌ని పేర్కొంటూ ప్రజలతో కలెక్టర్ ప్ర‌తిజ్ఞ చేయించారు.

ఇదీ చదవండి:

సామాన్యుల ప్రయోజనాలు కాపాడేందుకే.. భూ సర్వే: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.