ETV Bharat / state

muder: గరివిడిలో వ్యక్తి దారుణహత్య - విజయనగరం జిల్లా ప్రధాన వార్తలు

స్నహితులంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఘర్షణ పడ్డారు.. వారిలో ఐదుగురు కలిసి ఒకరిని దారుణంగా హత్య చేశారు. నలుగురు పరారవగా ఒకరు మాత్రం పోలీసులకు లొంగిపోయారు. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

గరివిడిలో వ్యక్తి దారుణహత్య
గరివిడిలో వ్యక్తి దారుణహత్య
author img

By

Published : Nov 2, 2021, 5:40 PM IST

విజయనగరం జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గరివిడిలోని ఓ కోళ్లఫారంలో సోమవారం అర్థరాత్రి పార్టీ జరుపుకుంటున్న ఆరుగురు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఐదుగురు వ్యక్తులు కలిసి బద్దరాజు అనే వ్యక్తిని హత్య చేశారు. అనంతరం నలుగురు నిందితులు అక్కడి నుంచి పరారవ్వగా...ఒకరు స్థానిక పోలీస్ స్టేషన్​లో లోంగిపోయినట్లు గరివిడి ఎస్సై లీలావతి తెలిపారు. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించినట్లు ఆమె తెలిపారు. ఈ హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్నామని...దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఎస్సై తెలిపారు.

ఇదీ చదవండి: Arrest: భారీగా ఎర్రచందనం పట్టివేత.. అంతర్జాతీయ రవాణా ముఠా అరెస్టు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.