విజయనగరంలోని పశుపతి నాథేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజామున 3 గంటల నుంచే స్పటిక లింగానికి పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు చేశారు. పట్టణంలోని శివాలయం వీధిలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలోనూ శివరాత్రి ప్రత్యేక పూజలు చేశారు.
పార్వతీపురంలోని అడ్డాపుశీల కాశీవిశ్వేశ్వర ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. నెల్లిమర్ల మండలం రామతీర్థాలు, సారిపల్లిలోని దిబ్బేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి.
ఎస్.కోట మండలం పుణ్యగిరిలోని సన్యాసేశ్వరుడు ఆలయంలో శివరాత్రి శోభ పరిఢవిల్లింది. తెర్లాం మండలం కూనయ్యవలసలోని భవానీ శంకరాలయంలో శివరాత్రి ప్రత్యేక ఆరాదనలు చేశారు. బలిజిపేట మండలం నారాయణపురంలోని చాతుర్లింగేశ్వరాయలంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
గంట్యాడలోని నీలకఠేశ్వర ఆలయం, తాటిపూడి ఉమా రామలింగేశ్వరాలయం, బొడికొండల మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా సాగాయి. మెరకముడిదాం సోమలింగాపురంలోని మహిమల ఉమా సోమలింగేశ్వర ఆలయంలో శివరాత్రి శోభ నెలకొంది.
కురుపాం మండలం గుమ్మలోని నీలకంఠేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలను కనులపండువగా చేపట్టారు. కొమరాడలోని గుంప పుణ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా నీలకంఠుడికి పూజలు జరిపించారు.
సాలూరులో శివరాత్రి మహోత్సవాలు..
సాలూరు పంచముఖేశ్వర ఆలయం భక్తుల కిటకిటలాడింది. అతి పురాతనమైన పంచముఖేశ్వరుడి ఆలయాన్ని దర్శించుకునేందుకు.. తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. సాలూరు రాజుల ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయంలో.. ఆ వంశంలో పుట్టి ప్రస్తుతం ఆలయ ధర్మకర్తగా.. దేవుడికి, భక్తులకు సేవ చేసుకొనే భాగ్యం కలగటం పూర్వజన్మ పుణ్యమని ఆలయ ధర్మకర్త యువరాజు అన్నారు. మరోవైపు.. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని.. భక్తుల సౌకర్యార్ధం గుంప, పుణ్యగిరి, పారుకొండ, రామతీర్థాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
ఇవీ చూడండి: