విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బాలగుడ గ్రామానికి చెందిన శ్రీనివాస రావు ఆటో చోదకునిగా పనిచేస్తున్నాడు. మార్గమధ్యంలో అతనికి పర్సు దొరికింది. రూ. 32వేల నగదు, క్రెడిట్ కార్డులు ఉన్న ఆ పర్సును , డ్రైవర్ శ్రీనివాస రావు పోలీసులకు అప్పగించాడు. పర్సులోని గుర్తింపు కార్డుల ఆధారంగా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన రవితేజకు సంబంధించినవిగా గుర్తించి పోలీసులు అతనికి సమాచారం అందించారు. ఆటో చోదకుడి నిజాయితీని గుర్తించి అతడిని శాలువా కప్పి సత్కరించారు.
ఆటో చోదకుని నిజాయితి..సత్కరించిన పోలీసులు
రూ.32 వేలు ఉన్న పర్సు రోడ్డుపై దొరకగా...పోలీసులకు అప్పగించిన ఆటోడ్రైవర్ నిజాయితీని గుర్తించిన పోలీసులు సన్మానించారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బాలగుడ గ్రామానికి చెందిన శ్రీనివాస రావు ఆటో చోదకునిగా పనిచేస్తున్నాడు. మార్గమధ్యంలో అతనికి పర్సు దొరికింది. రూ. 32వేల నగదు, క్రెడిట్ కార్డులు ఉన్న ఆ పర్సును , డ్రైవర్ శ్రీనివాస రావు పోలీసులకు అప్పగించాడు. పర్సులోని గుర్తింపు కార్డుల ఆధారంగా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన రవితేజకు సంబంధించినవిగా గుర్తించి పోలీసులు అతనికి సమాచారం అందించారు. ఆటో చోదకుడి నిజాయితీని గుర్తించి అతడిని శాలువా కప్పి సత్కరించారు.
TAGGED:
auto driver