విజయనగరం జిల్లా బొండపల్లి మండలానికి చెందిన ప్రేమికులు...ఇంటినుంచి పారిపోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బొండపల్లి మండలానికి చెందిన శ్రావణకుమార్, అనూషా గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్లో చిరుఉద్యోగిగా పనిచేస్తున్న శ్రావణ్ రెండు రోజుల క్రితం గ్రామానికి రాగా... గజపతినగరం మండలం మరుపల్లి సమీపంలోని సూర్య లే అవుట్లో ఇద్దరు కలుసుకున్నారు. తల్లిదండ్రులు వారి ప్రేమకు అడ్డు చెప్పారని ...శీతలపానీయంలో పురుగులమందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆందోళనకు గురైన జంట వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా...సంఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స చేశారు. అనంతరం వారిద్దరిని విజయనగరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా... ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రేమికుల ఆత్మహత్యాయత్నంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
ఇదీ చూడండి: విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం... భారీ క్రేన్ దగ్ధం