విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమడ సమీపంలో రహదారిపై లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. రోడ్లు అధ్వానంగా ఉండడంవల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. విశాఖ నుంచి పార్వతీపురం మీదుగా ఒడిశా రాష్ట్రం రాయగడ వెళ్లే రహదారి పలుచోట్లు పాడైపోయింది.
ముఖ్యంగా.. కొమరాడ మండల పరిధిలో రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు పడ్డాయి. ఈ కారణంగా.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలోనూ పలుసార్లు ప్రమాదాలు జరిగాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్లు మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి: