విజయనగరం ఆర్డీవో కార్యాలయం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. గజపతినగరం నుంచి వస్తున్న లారీ.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఒకరు ఏఆర్ కానిస్టేబుల్ రమణరాజుగా.. మరొకరు సీతం కళాశాల అధ్యాపకునిగా స్థానికులు గుర్తించారు.
బైక్‌ను ఢీకొట్టడంతో అదుపుతప్పిన లారీ.. రోడ్డుపక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులూ తీవ్రంగా గాయపడ్డారు. వీరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇదీచదవండి: వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి... ఆరుగురికి గాయాలు