విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రైల్వే బ్రిడ్జి సమీపంలో విజయనగరం నుంచి సంకిలి షుగర్ ఫ్యాక్టరీకి వెళ్తున్న చెరకు లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. రహదారికి అడ్డంగా లారీ బోల్తా పడటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే స్పందించిన చీపురుపల్లి పోలీసులు.. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. వేరొక లారీని ఏర్పాటు చేసి, లోడింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి