విజయనగరం జిల్లా భీమసింగి చక్కెర కర్మాగారం మనుగడ ఎందుకు దెబ్బతిందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బాబ్జి ప్రశ్నించారు. ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడం వల్ల రైతులు, కార్మికులు, ఉద్యోగులు నష్టపోతున్నారన్నారు. ఫ్యాక్టరీపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.
44 సంవత్సరాలు నిరంతరంగా నడిచిన కర్మాగారం ఈ ఏడాది ఎందుకు ఆగిపోయిందని బాబ్జి ప్రశ్నించారు. ఆధునీకరణ పేరుతో ప్రభుత్వం ఫ్యాక్టరీపై ఎలాంటి ప్రకటన చేయకుండా రైతుల్ని, కార్మికుల్ని త్రిశంకు స్వర్గంలో ఉంచిందని ఆరోపించారు. కర్మాగారంలో ఉన్న చక్కెరను ఎందుకు అమ్మలేకపోతున్నారని నిలదీశారు. వెంటనే ఫ్యాక్టరీ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చదవండి..