ETV Bharat / state

రైలుకు బ్రేకులు వేసి యువకుడిని కాపాడాడు! - విజయనగరం జిల్లా రైలు ఘటన వార్తలు

లోకోపైలట్ సమయస్ఫూర్తితో ఓ ప్రాణం నిలిచింది. పట్టాలపై యువకుడిని గుర్తించిన లోకో పైలట్....వెంటనే బ్రేకులు వేశాడు. రైలు యువకుడి దగ్గర వరకు వెళ్లి ఆగింది.

loco pilote stops train and saving a young man's life

author img

By

Published : Jun 7, 2020, 9:54 AM IST

పట్టాలపై యువకుడిని గమనించిన లోకో పైలట్... అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపి ప్రాణం కాపాడిన ఘటన ఇది. మూడ్రోజుల కిందట ఈ సంఘటన జరగగా.... దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన శ్రీనివాసరావు పట్టాలపై నడుచుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో విశాఖ నుంచి ఖాళీ బోగీలతో రైలు అతనికి ఎదురుగా వస్తోంది. కోరుకొండ దగ్గర పట్టాలపై ఉన్న యువకుడుని గుర్తించిన చోదకుడు.... అత్యవసర బ్రేకులు వేశారు. రైలు యువకుడి ముందుకు వెళ్లి ఆగింది. అతడిని కోరుకొండ స్టేషన్ సిబ్బందికి అప్పగించి లోకో పైలట్ వెళ్లిపోయారు. సంబంధిత స్టేషన్ సిబ్బంది విచారణ జరిపి... కేసు నమోదు చేశారు. వ్యక్తిగత పూచీకత్తు మీద యువకుని విడిచి పెట్టారు.

ఇదీ చదవండి

మూత్రాశయంలో మొబైల్‌ ఛార్జర్‌ కేబుల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.