విజయనగరం జిల్లాలోని మండపేట, సాలూరుల్లో తనిఖీలు నిర్వహించినట్లు ఎస్ఈబీ అధికారులు తెలిపారు. దాడులు చేస్తుండగా సాలూరులో జమదల పైడితల్లి అనే మహిళ నివాసంలో ఒక సంచిలో.. 150 నాటు సారా ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మరిపల్లి గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి నుంచి వాటిని కొని.. ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఆమె పోలీసులకు చెప్పగా.. ఇద్దరిపై కేసు నమోదైంది. మహిళను అరెస్టు చేసిన పోలీసులు.. వినోద్‌ను సైతం త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. సదరు మహిళను కోర్టు ముందు హాజరుపరుస్తామన్నారు. తనిఖీల్లో సెబ్ అధికారి సి.హెచ్.బాల నరసింహ, సీఐ రాజశేఖర్, ఎస్సై జగన్నాథం, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: