ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ... విజయనగరం కోట జంక్షన్ వద్ద మైక్ లైటింగ్ కార్మికులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా మైక్ లైటింగ్ సప్లయర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహంతి బంగారు బాబు మాట్లాడుతూ... గత సంవత్సరం కరోనా వల్ల ఎంతో నష్టపోయి తమ బ్రతుకులు రోడ్డున పడ్డాయని చెప్పారు.
మళ్ళీ కరోనా సెకెండ్ వేవ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం కర్ప్యూ నిర్వహించిందని... పెళ్లిళ్లకు అనుమతి ఇచ్చినా, పరిమితులు విధించడంతో లైటింగ్, సెట్టింగులు ఎవరూ పెట్టుకోకపోవడం.. తమకు ఆర్డర్లు లేకపోవడం వంటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను సీఎం జగన్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: