ETV Bharat / state

పెట్రోల్ బంకు వద్ద మందుబాబు హల్​చల్ - licker holder doing argument at parvathipuram

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పెట్రోల్ బంక్ వద్ద... ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. గంటపాటు ఆ ప్రాంతంలో తిరుగుతూ నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ హల్​చల్ చేశాడు.

పెట్రోల్ బంకు వద్ద మందుబాబు హల్​చల్
పెట్రోల్ బంకు వద్ద మందుబాబు హల్​చల్
author img

By

Published : Aug 20, 2021, 12:39 AM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పెట్రోల్ బంక్ వద్ద... ఓ మందుబాబు పెట్రోల్ కోసం వచ్చాడు. ఆ సమయంలో ఓ రోగిని విశాఖపట్నంకు తీసుకువెళ్తున్న అంబులెన్స్ వచ్చింది. అత్యవసరం కావడంతో అంబులెన్స్​కు ఇంధనం నింపేందుకు సిబ్బంది సిద్ధమయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ మందుబాబు... అంబులెన్స్​ చోదకుడితో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో అంబులెన్స్​ సిబ్బంది, ఆటోడ్రైవర్​లు పరస్పరం దాడులు చేసుకున్నారు. అంబులెన్స్ సిబ్బంది తనను కొట్టారని ఆరోపిస్తూ... పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటానని ఆటోడ్రైవర్ వీరంగం సృష్టించాడు. నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వినకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మందు బాబును ఆటోలో తరలించడంతో గొడవ సద్దుమణిగింది.

ఇదీచదవండి.

CM JAGAN: ఎమ్మెల్యే రమేష్​ బాబు కుమారుడి పెళ్లికి సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.