Protest: తమ గ్రామంలోని తారు ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ గ్రామస్థులు ఉద్యమం బాట పట్టారు. కోనాడ ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లాలోని ఎస్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఫ్యాక్టరీ ఉద్గారాల వల్ల గాలి, నీరు కలుషితమై పిల్లలు, పెద్దలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి.. తారు ఫ్యాక్టరీని మరోచోటకు తరలించాలని గ్రామస్థులు కోరారు.
ఇదీ చదవండి: "క్యాంటీన్‌లో మాంసాహారం వండిన వారిపై చర్యలు తీసుకోవాలి"