విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం కొండపైనున్న రాముడి విగ్రహాన్ని.. గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కోదండ రాముడి తలను తమతో పాటు తీసుకెళ్లగా.. సీత, లక్ష్మణ విగ్రహాలకు ఎటువంటి హాని చేయలేదు. తల లేని రాముడి విగ్రహాన్ని గమనించిన భక్తులు.. ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎస్పీ రాజకుమారితో పాటు స్థానిక పోలీసులు విగ్రహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నాయి.
నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు, విజయనగరం ఎంపీ బెల్లన చంద్రశేఖర్.. ధ్వంసమైన కోదండ రాముడి విగ్రహాన్ని పరిశీలించి విచారం వ్యక్తం చేశారు. రాముడి అడుగు జాడలున్న ప్రాంతంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. త్వరలోనే వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. నిందితుల గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు.
ఇదీ చదవండి: