విజయనగరం అయోధ్య మైదానం కాపాలదారుడు జరజాపు పేంటయ్య హత్యకు గురయ్యాడు. మైదానం కార్యాలయంలో రక్తపు మడుగులో పడిఉన్న అతడిని ఉదయం నడకకు వెళ్లిన వారు చూశారు. పోలీసులకు సమాచారం అందించారు. ఎస్పీతోపాటు రెండో పట్టణ సీఐ మైదానానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడిని రాళ్లతో దాడి చేసి హతమార్చినట్లు గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి... గుక్కెడు నీళ్లైనా లేవే...అధికారుల నిర్లక్ష్యమే కారణం