ఆటోలో ఉన్న సాయిరాం స్వాముల్ని చూసి దొంగలుగా భావించి బాలికలు భయపడిన ఘటన విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో జరిగింది. విద్యార్థులు పాఠశాలకు సైకిల్‌పై వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
విద్యార్థినుల కథనం ప్రకారం
మేము పాఠశాలకు వెళుతుంటే మాలో కొందరిని ఈ దారి ఎటువెళుతుందని స్వాములు అడిగారు. వారు సమాధానం చెప్పారు. అయితే స్వాములు ఆటోలో మా వెంట రావడం గమనించాం. దాంతో మాకు భయం వేసింది. వాళ్లను దొంగలుగా భావించి పరుగెత్తి..మా ఊరి వాళ్లకు విషయం చెప్పాం.
-విద్యార్థినులు
పిల్లలు భయపడి..
ఆటోలో వెళుతున్న స్వాముల వేషధారణ చూసి బాలికలు భయపడ్డారు. అయితే వారిని విద్యార్థినులు దొంగలనుకుని..తమను కిడ్నాప్ చేయడానికి వచ్చారని భయపడి స్థానికులకు చెప్పారు. దాంతో స్థానికులు తమకు సమాచారం ఇచ్చారు. స్వాముల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాం. లాక్ డౌన్ కు ముందే వాళ్లు(స్వాములు) మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి వచ్చినట్లు తేలింది. కాగా అప్పటినుంచి స్వాములు బిక్షాటన చేస్తున్నారు. అయితే స్వాములపై క్రిమినల్ రికార్డు కానీ..కేసులు కానీ ఇప్పటి వరకైతే లేవు. వాళ్లు ప్రయాణించే ఆటో వివరాలు కూడా పరీశీలిస్తున్నాం. త్వరలో తదుపరి వివరాలు వెల్లడిస్తాం. -బుధరాయవలస ఎస్సై నవీన్ పడాల్
ఇదీ చదవండి: రూ.4 కోట్ల మోసం కేసు.. నందిని కాటన్ మిల్లు భాగస్వామి కొల్లా సుధాకర్ అరెస్టు