కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ నిబంధనలకు అనుగుణంగా ఆహరం, మందులు.. ఇతర సౌకర్యాలు కల్పించాలని సంయుక్త కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. విజయనగరం కల్లెక్టరేట్ ఆడిటోరియంలో.. ఆసుపత్రుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రులలో ఏర్పాట్లను, ఆహార సరఫరా, పేషెంట్లకు అందించే వైద్యసేవల పర్యవేక్షణకు ఒక నోడల్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రెవిన్యూ, మెడికల్, నాన్ మెడికల్ అధికారులతో ఏర్పాటు చేసిన ఈ బృందం వెంటనే అన్ని ఆసుపత్రులను తనిఖీ చేయాలన్నారు. ప్రతి ఆసుపత్రి వద్ద 24 గంటలు పనిచేసే హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్ని ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది.. కొవిడ్ వ్యాక్సిన్ తప్పని సరిగా వేసుకొని ఉండాలన్నారు. వైద్యుల విన్నపం మేరకు కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా అంబులెన్సులు కేటాయిస్తామన్నారు.
ఇదీ చదవండి: