విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగు కళాశాల ఏర్పాటుకు అధికారులు గుర్తించిన స్థలాన్ని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆచార్యుల బృందం పరిశీలించారు. ఏడుగురు సభ్యులతో కూడిన బృందం కురుపాం సమీపంలోని టేకరఖండిలో గుర్తించిన స్థలాన్ని సందర్శించారు. ఇప్పటికే గిరిజన సంక్షేమశాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉపముఖ్యమంత్రి పి.పుష్పశ్రీవాణి ఈ స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంచార్జ్ సబ్ కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ స్థలానికి సంబంధించిన వివరాలు తెలిపారు. ఆచార్యుల బృందం నిర్ణయం మేరకు ఇంజినీరింగు కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసే దిశగా చర్యలు తీసుకోనుంది.
ఇదీ చదవండి: జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టు చేస్తారా?: చంద్రబాబు