ప్రధాని మోదీ పిలుపు మేరకు విజయనగరం జిల్లా శృంగవరపుకోట వాసులు జనతా కర్ఫ్యూని విజయవంతం చేశారు. ఉదయం నుంచే జనం రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి. ఏడు గంటల సమయానికి రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్నాయి. వ్యాపార దుకాణాలు, హోటల్స్, మాల్స్, లాడ్జీలు, సినిమా థియేటర్లు, రైతు బజారు అన్ని మూతబడ్డాయి. నిత్యం పట్టణంలో రద్దీగా ఉండే కూడలి జనం లేక బోసిపోయాయి. వైరస్‌పై పోరాటానికి జనం నుంచి అనూహ్య మద్దతు లభించినందున అధికార వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఇదీ చదవండి :