రాష్ట్రంలో మద్యం షాపులను నిషేధించాలని జనసేన నాయకులు, కార్యకర్తలు విజయనగరం కలెక్టరేట్ సమీపంలోని జ్యోతి రావు పూలే విగ్రహం వద్ద... మౌన పోరాటం చేశారు. లాక్డౌన్ సమయంలో మద్యం షాపులు తెరవకపోవడం వలన ప్రజలు సంతోషంగా ఉన్నారని... ఇప్పుడు దుకాణాలు తెరవగా మందుబాబులు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారని.. జనసేన నేత త్యాడా రామకృష్ణ చెప్పారు. దుకాణాల వద్ద మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటివి చేయటంలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో మద్యపాన నిషేధం చేస్తానని ప్రకటించిన మాటను నిలబెట్టుకోవాలని.. వెంటనే మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: