Jana Sena Tata Rao: గుంకలాం జగనన్న కాలనీలకు సంబంధించిన లబ్దిదారులు పవన్ కల్యాణ్‌తో మాట్లాడితే ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని జనసేన పీఏసీ సభ్యుడు తాతారావు ఆరోపించారు. గుంకలాం లే అవుట్ కోసం 397 ఎకరాలు సేకరించారని, అక్కడ వాస్తవంగా ఎకరం ధర 10 లక్షలు అయితే వైకాపా నేతలు 70 లక్షలకు కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. 12,565 ఇళ్లు మంజూరైతే ఇప్పటివరకు కనీసం 12 ఇళ్లు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రజలను ఇబ్బంది పెడితే అందుకు తగిన ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు.
గుంకలాన్ని రాజకీయం ఉనికి కోసం వాడుకోవద్దు: విజయనగరం మండలం గుంకలాం జగనన్న కాలనీలో పవన్ పర్యటనను స్వాగతిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే..డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. అయితే ఈ ప్రాంతాన్ని రాజకీయ ఉనికి కోసం వాడుకోవద్దని కోరారు. ఈ లేఅవుట్ లో నిర్మాణాలు జరగటం లేదని తప్పుడు సమాచారంతో పవన్ కల్యాణ్ ఇక్కడికి రావటం సరికాదని ఆయన అన్నారు. ప్రభుత్వం లబ్దిదారులకు 5 లక్షల రూపాయల విలువైన స్థలం ఇచ్చింది. అలాగే ఇంటి నిర్మాణానికి లక్షన్నర సహాయం చేస్తామని ఇంతకుముందే చెప్పాం. ఇవే కాకుండా ఇసుక, సిమెంటు, ఇనుమూ లబ్దిదారులకు అందుబాటులో ఉంచామన్నారు.
"పవన్ కల్యాణ్‌తో మాట్లాడితే ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామంటున్నారు" - విజయనగరం
JanaSena leader Tata Rao: గుంకాలాం జగనన్న కాలనీల్లో లబ్దిదారులపై వైకాపా నాయకులు అనుసరిస్తున్న తీరుపై జనసేన పీఏసీ సభ్యుడు తాతారావు స్పందించారు. వైకాపా నాయకులు ఆక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మరోవైపు పవన్ కల్యాణ్ గుంకలానికి రావటాన్ని స్వాగతిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.