విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గిరిజన విద్యార్థులకు ఆరోగ్య సేవలందిస్తున్న ఆదివాసీ హెల్త్ వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని పలువురు కోరారు. ఐటీడీఏ పరిధిలోని 8 సబ్‌ప్లాన్ మండలాల్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపసంచాలకుడికి వినతి పత్రం అందజేశారు. ఆరు నెలల వేతనాలను ఖాతాల్లో వేశామని అధికారులు చెబుతున్నారని, ఖాతాల్లో జమైన నగదులో తేడాలు ఉన్నాయని వాలంటీర్లు వివరించారు. 18 వేల వేతనం జమ కావాల్సి ఉండగా ఎనిమిది వేల రూపాయలు మాత్రమే పడిందని అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు.
ఇదీ చూడండి : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు