విజయనగరం జిల్లా పార్వతీపురం లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అలజంగి జోగారావును లెక్కింపు కేంద్రం ఆవరణలోకి అనుమతించారంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం ఎమ్మెల్సీ జగదీశ్వరరావు.. అక్కడికి చేరుకున్నారు.
ఎమ్మెల్సీ జగదీశ్వరరావును పోలీసులు అడ్డుకునే క్రమంలో కాస్త ఉద్రిక్తత ఏర్పడింది. తనతో పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన స్వల్ప తోపులాటలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న డీఎస్పీ సుభాష్ ఎమ్మెల్యే జోగారావు, ఎమ్మెల్సీ జగదీశ్వరరావుకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు.
ఇవీ చూడండి: