విజయనగరం జిల్లాలో 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వాడవాడలా మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో ఇంచార్జ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎస్పీ రాజకుమారితో కలసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.
కొవిడ్-19 ఆంక్షలు పాటిస్తూ భద్రత దళాలు కవాతు నిర్వహించాయి. అనంతరం మంత్రి, కొవిడ్ వారియర్స్ ను సత్కరించారు. కరోనా కాలంలో సేవల్లో ముందు వరుసలో నిలుస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి, పతకాలు అందజేశారు. విజయనగరం జిల్లా ప్రగతిని, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు.
ఇవీ చదవండి: