విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల నిర్మాణానికి గతంలో మంజూరైన నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. నేటికీ అద్దె భవనాల్లోనే పాఠశాలలు నడుస్తున్నాయి. ఎగువ గంజాయి భద్ర, దిగువ గంజాయి భద్ర, ఎగువ సెంబీ గ్రామాల్లో భవనాల నిర్మాణాలు అర్థంతరంగా నిలిచిపోయాయి.
వీటిని పశువులను కట్టుకునేందుకు గ్రామస్థులు వినియోగించుకుంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి భవన నిర్మాణాలను పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. కాగా... ఈ గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు మాత్రం బాగానే నడుస్తున్నాయి.
ఇదీ చదవండి: