విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వట్టిగడ్డ వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో మోసూరు కాజ్వే కొట్టుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీపురుపల్లి, గుర్ల, గరివిడి, మెరకముడిదాం మండలాల్లో మెుక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాలకు తడిసి మెుక్కజొన్న మెులకెత్తే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీచదవండి
రాష్ట్రంలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక