విజయనగరం జిల్లా పార్వతీపురంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు పర్యటించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సాదరంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం కలెక్టర్ క్యాంపు హౌస్కు చేరుకున్నారు. ఐటీడీఏ పీవో వినోద్ కుమార్, ఉప కలెక్టర్ సుమిత్ గరుడ న్యాయమూర్తులను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఇది కూడా చదవండి