ETV Bharat / state

ఈనెల 28 నుంచి మావోయిస్టు వారోత్సవాలు.. అప్రమత్తమైన పోలీసులు

ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వరకు మావోయిస్టు(maoist) వారోత్సవాల నేపథ్యంలో విశాఖ జిల్లా పెదబయలు పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోలు అలజడి సృష్టించే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో ఏజెన్సీ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు.

Maoist commemoration
ఈనెల 28 నుంచి మావోయిస్టు వారోత్సవాలు
author img

By

Published : Jul 18, 2021, 9:43 PM IST

ఈనెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు వారోత్సవాలు జరగనున్నాయి. మావోలు అలజడి సృష్టించే అవకాశం ఉందన్న సమాచారంతో విశాఖ జిల్లా పెదబయలు పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. బాంబు డిస్పోజల్ టీంతో ప్రధాన రహదారుల్లో తనిఖీలు చేపట్టారు. రెండు రోజులుగా పెదబయలు ఎస్​ఐ పి. మనోజ్ కుమార్, ఆర్​ఎస్​ఐ మహేశ్ రెడ్డి ఆధ్వర్యంలో సీఆర్​పీఎఫ్​(CRPF) బలగాలు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశాయి. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

మావోయిస్టు యాక్షన్ టీంలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాన రహదారులపై వాహన రాకపోకలను పరిశీలిస్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినట్లు గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని గ్రామస్థులకు ఎస్సై విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి..

చమురు ధరల పెంపునకు నిరసనగా నారాయణ అర్ధనగ్న ప్రదర్శన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.