విజయనగరం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, ఎస్.కోట, గజపతినగరం, భోగాపురం, నెల్లిమర్లలో భారీ వర్షం కురిసింది.
విజయనగరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. నగరంలోని ప్రధాన వీధులు, శివారు కాలనీల్లోని రోడ్లు బురదతో నిండిపోయాయి. మంగళ వీధి, కోళ్ల బజార్, మంచుకొండవారి వీధులు జలమయమవగా.. దాసన్నపేట, ప్రశాంతినగర్‌లో మోకాలు లోతు నీటితో ప్రజల అవస్థలు పడుతున్నారు. నగరంలోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పర్యటించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన కోరారు. వేగంగా సహాయ చర్యలు చేపట్టాలని మున్సిపల్, విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి:
Justice Devanand: హైకోర్టు న్యాయమూర్తి దేవానంద్‌కు ఘన స్వాగతం