విజయనగరం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంతో పాటు నెల్లిమర్ల, డెంకాడ, గుర్ల మండలాల్లో జోరు వర్షాలతో ప్రజలు తడిసిముద్దయ్యారు. విజయనగరంలో చేపల మార్కెట్, పెద్ద మార్కెట్ సిటీ బస్టాండ్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. గుర్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గుర్ల మండలంలో నూతనంగా నిర్మిస్తున్న వంతెన పక్క రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో విజయనగరం-రాజాంకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనకు ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోవటంతో పోలీసులు వంతెన వద్దకు చేరుకొని శ్రీకాకుళం జిల్లా పాలకొండ వైపు వెళ్లే వాహనాలను రామతీర్థం, బొప్పడాం మీదుగా చీపురుపల్లి వైపు మళ్లించారు.
ఇదీ చదవండి: 'ఎన్నాళ్లీ 'డోలీ' కష్టాలు... అష్టకష్టాలు పడాల్సిందేనా?'