విజయనగరం జిల్లా పార్వతీపురంలోని గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో అరకొర వసతుల మధ్య విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 380 మంది విద్యార్థులున్న వసతి గృహంలో వంట చేసేందుకు, భోజనం చేసేందుకు సైతం సరైన వసతులు లేవు. విద్యార్థులు పాడుబడిన శిథిల గదుల వద్దే బుగ్గిలో కూర్చొని భోజనాలు చేస్తున్నారు. వసతి గృహంలో వంట కోసం ప్రత్యేక గదులు లేకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిసరాల మధ్య భోజనం చేస్తే తమ ఆరోగ్య పరిస్థితి ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఎండ, వానలోనూ వరండాలోనే భోజనాలు చేస్తున్నామని వాపోయారు. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: