విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ గరుగుబిల్లి మండల కేంద్రంలో కరోనా పాజిటివ్ కేస్ నమోదు కావడంపై యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టింది. గరుగుబిల్లిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.
ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేస్తున్నారు. క్రిమిసంహారక మందు పిచికారీ చేయించారు. ఇన్ చార్జ్ ఉప కలెక్టర్ అంబేద్కర్ పరిస్థితిని పర్యవేక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ వెళ్లి సరకులు, కూరగాయలు అందించే ఏర్పాట్లు చేపట్టారు.
ఇదీ చూడండి: