గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి... అభివృద్ధి చెందేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభిప్రాయపడ్డారు. విజయనగరం జిల్లా సాలూరులో గవర్నర్ పర్యటించారు. గిరిజన వసతి గృహాలు, కళాశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటారు. గిరిజనుల కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గవర్నర్‌కు వివరించారు. జిల్లాలో గిరిజన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి కలెక్టర్ హరి జవహర్‌లాల్ తెలిపారు. ప్రసూతి మహిళల వసతిగృహాన్ని బిశ్వభూషణ్ సందర్శించారు. పాచిపెంట మండలం అమ్మవలసలో గిరిజన రైతులతో గవర్నర్ ముఖాముఖి నిర్వహించారు.
ఇదీ చదవండి... తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర అవతరణ దినోత్సవం